హైదరాబాద్ కు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన హైదరాబాద్ లోనే ఉండనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ కు సింధియా బీజేపీ ఇన్ ఛార్జ్ గా వస్తున్నారు. పాతబస్తీలో ఇవాళ, రేపు బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలోపేతంపై చర్చించనున్నారు.
మలక్ పేట్, చంద్రాయణగుట్ట, గోషామహాల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చంపాపేట్ లో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మీ అమ్మవారిని సింధియా దర్శించుకోనున్నారు. రెండు రోజుల పాటు ఫలకనూమా ప్యాలెస్ లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బస చేయనున్నారు.
