- ప్రతిపక్ష సభ్యులకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై పార్లమెంట్‌లో వెంటనే చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సోమవారం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే సర్‌పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరడంతో, ప్రభుత్వం అందుకు నిరాకరించింది. దీంతో రాజ్యసభ నుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. ‘‘సర్ లేదా ఎన్నికల సంస్కరణలు.. విషయం ఏదైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, వెంటనే చర్చించాలని డిమాండ్ చేయొద్దు. ఈ విషయంపై చర్చించేందుకు మాకు మరికొంత సమయం కావాలి. సర్‌పై చర్చ ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
ఈ రోజే దానిపై చర్చ చేపట్టాలని మీరు పట్టుబడితే కష్టమవుతుంది. ఎందుకంటే జాబితా చేసిన ఇతర అంశాలపై మొదట సభలో చర్చిద్దాం. మీరు కోరుకుంటున్నట్లు సర్‌పై చర్చను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం లేదు. కొంత సమయం కావాలని అడుగుతున్నాం. ఏ విషయంపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని అనుకోవద్దు” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
