కాంగ్రెస్​, టీఆర్ఎస్​ ఒక్కటే

కాంగ్రెస్​, టీఆర్ఎస్​ ఒక్కటే
  • టీఆర్ఎస్ ఫెయిల్యూరే మా ప్రచారాస్త్రాలు
  • చిట్​చాట్​లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఫల్యాలే ప్రధాన ప్రచార అస్త్రంగా బరిలోకి దిగుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గురువారం హైదరాబాద్ లో  మీడియాతో చిట్ చాట్ చేశారు. స్థానికంగా ఎన్నో సమస్యలున్నాయని , ఇవన్నీ టీఆర్ఎస్​పై వ్యతిరేకత పెంచాయని అన్నారు. ఎలక్షన్లలో బీజేపీకి మజ్లిస్​ పార్టీయే అసలైన ప్రత్యర్థి అని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ నాయకులు గెలిచినా టీఆర్ఎస్​లోనే చేరతారన్నారు. సీఏఏ వల్ల ఏ ఒక్క భారతీయ పౌరుడికి నష్టం జరుగదని, అలాంటప్పుడు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆయా పార్టీల నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.

నివేదిక వచ్చాకే 3 రాజధానులపై  మాట్లాడతా

ఏపీలోని 3 రాజధానుల అంశంపై  బీజేపీ ఎంపీలు తలో మాట మాట్లాడవద్దని కిషన్ రెడ్డి సూచించారు.  దీనిపై కమిటీ నివేదిక వచ్చేదాక మౌనంగా ఉండాలన్నారు. రాజధాని అంశం రాష్ట్ర  ప్రభుత్వ పరిధిలోనిదే అయినప్పటికీ, ఏ రకంగా మూడు రాజధానులు చేస్తారు? వాటి విధి, విధానాలు ఏమిటనే దానిపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. బీజేపీ రాష్ట్ర, జాతీయ పార్టీలు ఓ నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ తన అభిప్రాయం చెబుతుందని, అప్పుడు తానే స్పందిస్తానన్నారు.

Union Minister Kishan Reddy chit chat with media on municipal elections