మెట్రో అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

మెట్రో అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దిల్ కుశా అతిథి గృహంలో మెట్రో అధికారులతో జరిగిన మీటింగ్ లో మాట్లాడిన ఆయన… మెట్రో రూట్ ప్రారంభోత్సవంలో  ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. ఇటీవల JBS నుంచి MGBS వరకు ప్రయాణించే  మెట్రో రూట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే .. కేంద్రం భాగస్వామిగా ఉన్న ప్రాజెక్టులో ప్రధాని ఫోటోను వాడడం ప్రోటోకాల్ అని  ఆ రూల్స్ ను కూడా… హైదరాబాద్ మెట్రో అధికారులు పాటించలేదని అన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం భాగస్వామిగావున్న ప్రభుత్వ కార్యక్రమాలను టీఆర్ఎస్ పంక్షన్ లా ఎలా చేస్తారని ఆయన కోపానికి వచ్చారు.

లోకల్ ఎంపీనైన తనకు ఒక రోజు ముందు చెప్పడమేంటని కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అధికారులను ప్రశ్నించారు. అదికూడా.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు….  స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు…  ఒకరోజు ముందు కార్యక్రమానికి ఆహ్వానిస్తే అక్కడి పనులను ఆపేసి ఎలా ప్రారంభోత్సవానికి వస్తామనుకున్నారని అధికారులను అడిగారు. కనీసం దేశ ప్రధాని ఫొటోను ప్రారంభోత్సవంలో వాడకపోవడం మెట్రో అధికారుల అధికార దుర్వినియోగాన్ని సూచిస్తుందని అది సరికాదని చెప్పారు. ఇప్పటివరకు మేము కేంద్రం నుంచి 1250 కోట్లు ఇచ్చామని ఇంకా ఇవ్వాల్సిన 200 కోట్లరూపాయలను కూడా ఇస్తామని చెప్పారు.