
సైబర్ నేరాల పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా సైబర్ సెక్యూరిటీ ఇమేజ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆయన.. సైబర్ నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ, మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సాకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.
సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా బీహార్ మినహా అన్ని పోలీస్ స్టేషన్ లకు కేంద్రంతో కనెక్టివిటీ ఇచ్చామని తెలిపారు. పెరుగుతున్న సాకేతిక పరిజ్ఞానంలో సిటిజన్స్ కు స్మార్ట్ కార్డ్ అవసరం ఏందని అన్నారు. సైబర్ క్రైమ్ సైబర్ టెర్రరిజాం పై ఇంకా చాలా విషయాలు తెల్సుకోవాల్సిఉందని… నదులు, కొండల ప్రాంతల్లో మానవ రహిత భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.