విపత్తు నిధులు 900 కోట్లున్నా.. రాష్ట్రం ఖర్చు చేస్తలే : కిషన్​రెడ్డి

విపత్తు నిధులు 900 కోట్లున్నా.. రాష్ట్రం ఖర్చు చేస్తలే :  కిషన్​రెడ్డి
  • విపత్తు నిధులు 900 కోట్లున్నా.. రాష్ట్రం ఖర్చు చేస్తలే :  కిషన్​రెడ్డి
  • రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయడం లేదని ఆగ్రహం  
  • పరిహారం అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన  
  • మోరంచపల్లి, వరంగల్​లో వరద బాధితులకు పరామర్శ 
  • నిత్యావసర సరుకులు పంపిణీ 
  • వరద బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి డిమాండ్ 

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/ హనుమకొండ, వెలుగు:  రాష్ట్ర సర్కార్ దగ్గర ‘విపత్తు నిధులు’ రూ.900 కోట్లు ఉన్నా ఖర్చు చేయడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే ఆ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి, వరంగల్ నగరంలో కిషన్ రెడ్డి పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. కేంద్రం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ రెండు చోట్ల మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. వరద బాధితులకు రాష్ట్ర సర్కార్ సాయమందించాలని డిమాండ్ చేశారు. 

‘‘విపత్తులు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునేందుకు ప్రతి రాష్ట్రం దగ్గర ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉంటయ్. ఇందులో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం నిధులు ఉంటయ్. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ దగ్గర ఎస్డీఆర్ఎఫ్ నిధులు దాదాపు రూ.736 కోట్లు ఉన్నయ్. ఇవికాకుండా 2022–23కు సంబంధించి కేంద్రం రూ.178 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా 2023–24కు సంబంధించి మరో రూ.198 కోట్లు కేంద్రం దగ్గర ఉన్నయ్. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక ప్రణాళిక రిపోర్టు ఇవ్వని కారణంగా వాటిని విడుదల చేయలేదు. ఆ రిపోర్టు ఇస్తే వెంటనే విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మొత్తం రూ.900 కోట్లకు పైగా ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నయ్. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరద బాధితులను ఆదుకోవాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో రిపేర్లు చేపట్టాలి” అని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.3 లక్షలు, రాష్ట్రం వాటా రూ.లక్ష ఉంటుందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సెంట్రల్ టీమ్ సోమవారం వస్తుందని చెప్పారు. ఆ టీమ్ ఇచ్చే రిపోర్టు ప్రకారం కేంద్రం నిధులు విడుదల చేసి ఆదుకుంటుందని తెలిపారు.  

ఎకరాకు రూ.10 వేలు ఏవీ? 

రాష్ట్ర సర్కార్ తీరుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ‘‘భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో ఏ సహాయం చేయలేకపోతున్నం. అసలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద రైతులు ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఉండొద్దు. బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉండేది ఇంకో నాలుగు నెలలే. ఈ నాలుగు నెలల్లోనైనా ఫసల్​బీమా అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణలో ఫసల్ బీమా పథకం కింద గతంలో 10 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. 2016 నుంచి 2020 వరకు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు సాయం అందింది. కానీ 2020 నుంచి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. బీమా పథకం అమలు చేయకపోవడంతో పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, మాజీ ఎంపీలు రవీంద్ర నాయక్‌‌‌‌‌‌‌‌, గరికపాటి మోహన్‌‌‌‌‌‌‌‌రావు, పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు కిషన్​ రెడ్డి ఉన్నారు. 

అన్నీ కోల్పోయినం.. ఆదుకోండి 

వరదలతో అన్నీ కోల్పోయామని, తమను ఆదుకోవాలని కిషన్ రెడ్డిని మోరంచపల్లి గ్రామస్తులు వేడుకు న్నారు. ‘‘మోరంచవాగు ఉప్పొంగి రాత్రికి రాత్రి ఊ రంతా కొట్టుకుపోయింది. ఇండ్లు, చెట్ల మీదికి ఎక్కి బతికినం. వరదలకు నలుగురు కొట్టుకుపోయిన్రు. ఇద్దరి శవాలు ఇంకా దొర్కలే. కూడు.. గూడు.. గొడ్డూగోదా అంతా పోయింది. కట్టుబట్టలే మిగిలిన య్. వానలు ఎలిసి నాలుగు రోజులవుతున్నా సర్కార్ సాయం అందలే. సర్వం కోల్పోయినం.. మమ్మల్ని ఆదుకోండి సారూ” అని కన్నీళ్లు పెట్టుకున్నారు. వర ద వచ్చిన రోజు ఒక్క ఫోన్ కాల్ తో స్పందించి రెండు హెలికాప్టర్లు పంపించినందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని బాధితులకు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.