కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

V6 Velugu Posted on Jan 24, 2022

ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లనే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతుందని సదరు లేఖలో వివరించారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే కేంద్రం తెలంగాణకు ఏం చేసిందంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్రప్రభుత్వం వ్యయం భరించడం లేదన్నారు. భూసేకరణ కూడా పూర్తి చేసి ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ చేసి ఇచ్చి ఉంటే పనుల్లో పురోగతి కనిపించేదన్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైలు మార్గం, అక్కన్నపేట- మెదక్, ఎంఎంటీఎస్ ఫేజ్ -2 తో పాటు చాలా రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ తన వాటాను జమచేయకపోవడం వల్ల ముందడుగు పడటం లేదన్నారు కిషన్ రెడ్డి.

 

ఇవి కూడా చదవండి

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్

ఆటో డ్రైవర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్

 

Tagged cm, Telangana, KCR, Letter, Kishan reddy, Union Minister, delay, cooperation, Railway projects

Latest Videos

Subscribe Now

More News