ప్రాజెక్టులను ఏటీఎంలుగా మార్చుకున్నరు

ప్రాజెక్టులను ఏటీఎంలుగా మార్చుకున్నరు

హుజూరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టులు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని కేంద్ర మంత్రి  మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు. శనివారం హుజూరాబాద్ లో ఆయన మాట్లాడారు. నాలుగు కోట్ల మంది కోసం నాలుగు వేల వెల్ నెస్ సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారని, ఇవి సరిపోతాయా అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ప్రతిచోటా మంత్రి, ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తారని, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో బీజేపీ పాత్ర ఎంతో ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అద్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు సంపత్ రావు, గంగిశెట్టి రాజు, ప్రవీణ్, కరుణాకర్, కుమార్, రాజు, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.