కేసీఆర్ కు పాకిస్థాన్ పై ఉన్న నమ్మకం మనపై లేదు

కేసీఆర్ కు పాకిస్థాన్ పై ఉన్న నమ్మకం మనపై లేదు

ఎవరి కోసం తెలంగాణ భవన్ లో ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు కేంద్రమంత్రి మురళీధరన్. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ వరి దీక్షలో పాల్గొన్న ఆయన.. మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొని కేంద్రానికి ఇవ్వాలన్నారు. కేసీఆర్ వడ్లు కొనేందుకు వెనకాడుతున్నారన్నారు ధాన్యం కొనుగోళ్లకు ఇచ్చే డబ్బులన్నీ కేంద్రానివేనన్నారు. మోడీతో కొట్లాడటానికి, రాష్ట్రాలు తిరగడానికి డబ్బులుంటాయి కానీ...వడ్లు కొనడానికి లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసేవన్నీ నాటకాలేనన్నారు. కేసీఆర్ కు పాకిస్థాన్ పై ఉన్న నమ్మకం దేశప్రజలపై లేదన్నారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల కరప్షణ్ రావు, కమీషన్ రావు అని అన్నారు.  కేసీఆర్ చీప్ మినిస్టర్ కాదని..చీఫ్ మిస్ లీడర్ అని అన్నారు. కమీషన్ రావు దేశాన్ని మోసం చేస్తున్నారన్నారు. హుజురాబాద్, దుబ్బాకలో ప్రజలు టీఆర్ ఎస్ కు బుద్ధి చెప్పారన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారన్నారు.

రామయ్య పట్టాభిషేకంలో గవర్నర్‌ను పట్టించుకోని అధికారులు