అగ్రికల్చర్‌‌లో భారత్‌‌ గ్లోబల్‌‌ లీడర్‌‌

అగ్రికల్చర్‌‌లో భారత్‌‌ గ్లోబల్‌‌ లీడర్‌‌
  • కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌‌ తోమర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలోని అగ్రికల్చర్‌‌ బిజినెస్‌‌లో విప్లవాత్మక మార్పులకు నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌‌టెన్షన్ మేనేజ్‌‌మెంట్(మేనేజ్‌‌)సంస్థ ఎంతో కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. హైదరాబాద్‌‌ రాజేంద్రనగర్‌‌లో మేనేజ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 6వ కాన్వొకేషన్‌‌కు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు సేవ చేసే అవకాశం దక్కినందుకు మేనేజ్‌‌ విద్యార్థులు గర్వపడాలని తోమర్ అన్నారు. ఉద్యోగం చేసుకుంటూనే రైతులకు సేవ చేయడానికి సమయాన్ని కేటాయించాలని సూచించారు. అగ్రికల్చర్‌‌లో భారత్‌‌ గ్లోబల్‌‌ లీడర్‌‌గా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని మేనేజ్‌‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి. చంద్ర శేఖర్ చెప్పారు.  అందులో భాగంగా స్టూడెంట్లను వివిధ దేశాల రాయబార కార్యాలయాలకు అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 200లకు పైగా అగ్రిసంస్థలను ప్రారంభించి .. అగ్రికల్చర్‌‌ బిజినెస్‌‌ రంగంలో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా 2018–22 మూడు బ్యాచ్‌‌లకు చెందిన 202 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. మూడు వరుస బ్యాచ్‌‌ల నుంచి 9 మంది విద్యార్థులు గోల్డ్‌‌, సిల్వర్‌‌, బ్రాంజ్‌‌ మెడల్స్‌‌,  అగ్రి-వెంచర్లతో అగ్రికల్చర్‌‌ సెక్టార్‌‌లో కృషి చేసిన ముగ్గురు పూర్వ విద్యార్థులు కూడా అవార్డులు  అందుకున్నారు. సెంట్రల్‌‌ సెక్రటరీ  మనోజ్ అహుజా, మేనేజ్‌‌ ఫ్యాకల్టీలు, సిబ్బంది