
న్యూఢిల్లీ, వెలుగు: మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణ లో ప్రభుత్వం మారింది కానీ, ఉచితాల సంస్కృతి ఇంకా ఉందని తెలిపారు. శనివారం లంచ్ చేసేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ క్యాంటీన్ కు ఆమె వచ్చారు. ఈ సందర్బంగా సివిల్స్ ఆస్పిరెంట్స్ తో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణలో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందన్నారు. ప్రధానంగా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.