సీఎంతో కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ భేటీ

సీఎంతో కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ భేటీ
  • రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
  • పరిశ్రమలకు వేగంగా అనుమతులివ్వాలని కోరిన సీఎం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డితో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు.  హైదరాబాద్​లోని సీఎం నివాసంలో జరిగిన ఈ మీటింగ్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం ఆహ్వానించారు. కాగా, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించినట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. 

ఇటీవల 5 రోజులపాటు ఢిల్లీలో పర్యటించిన రేవంత్​రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులను కలిసారు. పరిశ్రమల స్థాపనకు కేంద్రం నుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చొరవ చూపాలని పీయూష్​ గోయల్​ను సీఎం రేవంత్​ కోరినట్టు సమాచారం.