టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది

రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. నోరు తెరిస్తే బూతులు, అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి జేబులు నింపుకొనే పనిలో పడ్డారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలనకు చెక్ పడుతామన్నారు. రైతుల పక్షపాతి అయిన‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మోడీకి భారతదేశ ప్రజలే కుటుంబమని, కేసీఆర్ కు మాత్రం ఆయన కుటుంబ సభ్యులే ముఖ్యమన్నారు.

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. మణికొండలోని ఓ ఫంక్షన్ హాల్ లో.. పండిట్ దీన్ దయాళ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పండిట్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మణికొండలోని దళిత మోర్చా అధ్యక్షుడు వినోద్ ఇంట్లో అల్పాహారం చేశారు. ఈ మధ్య అనారోగ్యంతో మరణించిన మణికొండ వార్డు కౌన్సిలర్ వందన నాగేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బండ్లగూడలో ఏర్పాటు చేసిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ బీజేపీ సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్, స్వామి గౌడ్ తో కలిసి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.