
కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్ అడవిలో చెట్లు నాటడానికి వెళ్లిన FRO అనిత, టీం పై జరిగిన దాడిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సీరియస్ అయ్యారు. దాడి విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించిన ఆయన.. ఓ మహిళా ఆఫీసర్ పై దాడిచేయడాన్ని తాము తీవ్రంగా తీసుకుంటున్నామని… నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
FRO అనితపై జరిగిన దాడిని ఖండిచారు అటవీశాఖ ఉన్నతాధికారులు. అరణ్య భవన్ లో సమావేశమైన వారు అనితపై దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ప్రతిపాదించారు. దీంతో పాటు… కొందరు నాయకులు అటవీ అధికారులను తరచూ టార్గెట్ చేస్తున్నారని అన్నారు.