మ్యానిఫెస్టోపై సలహాలు స్వీకరిస్తున్న కేంద్ర ఐటీ శాఖమంత్రి

మ్యానిఫెస్టోపై సలహాలు స్వీకరిస్తున్న కేంద్ర ఐటీ శాఖమంత్రి

మాదాపూర్లోని హోటల్ ట్రైడెంట్ లో ఐటీ అధిపతులు, న్యాయ నిపుణులతో కేంద్ర న్యాయ, ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ సమావేశమయ్యారు. భారత్ కే మన్ కీ భాత్..మోదీకే సాథ్ పేరిట వరుస సమావేశాలు పెడుతోంది. ప్రజల నుంచి వివిధ రంగాల నిపుణుల వరకూ.. మ్యానిఫెస్టోపై సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు దేశ వ్యాప్తంగా 7 వేల సూచనల బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. భారత్ ఆర్థిక రంగంలో ప్రపంచంలో ఆరోస్థానంలో నిలిచిందన్నారు.

మన్మోహన్ హయాంలో 11 స్థానంలో ఉండేదన్నారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. 40 కోట్ల మందికి పించన్, రైతులకు ఆరు వేల సాయం వంటి పథకాలను అందిస్తున్నామని చెప్పారు. మోడీ హయాంలో 10 కోట్ల టాయిలెట్స్ నిర్మించామన్నారు. మహాకూటమి లో గతంలో ఎంతోమంది యేడాదికి మించి దేశాన్ని పాలించలేకపోయారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఐటీ అధిపతులు పాల్గొన్నారు.