
- టీడీకే ప్లాంట్‌ను ప్రారంభించిన మినిస్టర్ అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన టీడీకే కార్పొరేషన్ లిథియం- అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం సోహ్నా (హర్యానా)లో ప్రారంభించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి మొదటి దశలో రూ.3 వేల కోట్లు ఖర్చు అయ్యింది. ‘‘ఈ ఫ్యాక్టరీతో దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ మరింత పెరుగుతుంది. ఈ రంగంలో సప్లయ్ చెయిన్‌ను పెంచాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, ఎయిర్‌బడ్స్, ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం- అయాన్ బ్యాటరీలు ఇప్పుడు భారత్‌లోనే తయారవుతాయి.
ఈ ప్లాంట్ ప్రతి సంవత్సరం సుమారు 20 కోట్ల బ్యాటరీ ప్యాక్స్ ఉత్పత్తి చేస్తుంది" అని ” అని వైష్ణవ్ పేర్కొన్నారు. టీడీకే కంపెనీ యాపిల్, ప్రముఖ మొబైల్, ల్యాప్‌టాప్ తయారీదారులకు బ్యాటరీలు సరఫరా చేస్తోంది. భారత్‌లో మొబైల్ రంగానికి ప్రతి సంవత్సరం 50 కోట్ల సెల్ ప్యాక్స్ అవసరం ఉండగా, ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 40శాతం అవసరాన్ని తీర్చొచ్చని మంత్రి తెలిపారు. ఈ ఫ్యాక్టరీ 5 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. టీడీకే సీఈఓ ఫుమియో సషిదా మాట్లాడుతూ, ఈ సంవత్సరం చివరి క్వార్టర్‌లో చిన్న స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. డిమాండ్‌ను బట్టి 20 కోట్ల ఉత్పత్తి సామర్థ్యానికి పెరుగుతుందన్నారు.