మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు గుడ్ న్యూస్

మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు గుడ్ న్యూస్
  • యూనియన్ మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త ఎఫ్​ఓఎఫ్​

హైదరాబాద్​, వెలుగు: యూనియన్ మ్యూచువల్ ఫండ్, యూనియన్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఓఎఫ్)​ను ప్రారంభించింది. ఇది సాధారణ మ్యూచువల్ ఫండ్ లాగా నేరుగా స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బాండ్ల వంటి సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టకుండా,  ఇతర మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెడుతుంది. లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ విభాగాలలోని ఇతర యూనియన్ మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల ఒకే ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా విభిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. ఇది అనేక ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు