ఇంటర్​తో డిఫెన్స్​కు..నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యూపీఎస్సీ

ఇంటర్​తో డిఫెన్స్​కు..నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యూపీఎస్సీ
యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(యూపీఎస్సీ) నేష‌న‌‌ల్ డిఫెన్స్ అకాడ‌‌మీ(ఎన్‌‌డీఏ), నావ‌‌ల్ అకాడ‌‌మీ(ఎన్ఏ) ఎగ్జామినేషన్​(1) 2021కు  నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.  ఎంపికైన అభ్యర్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో 2 జ‌‌న‌‌వ‌‌రి 2022లో ప్రారంభ‌‌మ‌‌య్యే 147వ కోర్సు, 109వ ఇండియ‌‌న్ నేవ‌‌ల్ అకాడ‌‌మీ(ఐఎన్ఏసీ) కోర్సుల్లో చేరి సక్సెస్​ఫుల్​ ట్రైనింగ్​ తర్వాత ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చు. నేష‌‌న‌‌ల్ డిఫెన్స్ అకాడ‌‌మీ(ఎన్‌‌డీఏ), నావ‌‌ల్ అకాడ‌‌మీ(ఎన్ఏ) ఎగ్జామినేషన్​(1) 2021కు  బాలురు మాత్రమే అర్హులు. ఆర్మీ వింగ్ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం సెకండ్​ ఇయర్​ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్​ ప్రాసెస్​ రాతపరీక్ష/ఎస్​ఎస్​బీ ఇంటర్వ్యూ/పర్సనాలిటీటెస్ట్. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్–1 మ్యాథమేటిక్స్- 300 మార్కులకు, పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులకు ఉంటాయి. మ్యాథమెటిక్స్​లో ఆల్​జీబ్రా, మ్యాట్రిసెస్​& డిటర్మినెంట్స్, ట్రిగొనోమెట్రి,అనలిటికల్​ జామెట్రీ ఆఫ్​ టు అండ్​ త్రీ డైమెన్షన్స్, డిఫరెన్సియల్​ కాలిక్యులస్​, ఇంటిగ్రల్​ కాలిక్యులస్​& డిఫెరెన్షియల్​ ఈక్వేషన్స్, వెక్టర్​ ఆల్​జీబ్రా, స్టాటిస్టిక్స్​ & ప్రాబాబులిటీ చాప్టర్ల నుంచి ప్రశ్నలొస్తాయి. జనరల్​ ఎబిలిటీ టెస్ట్​ పేపర్​ 2లో ఇంగ్లిష్​కు 200, జనరల్ నాలెడ్జ్​కు 400 మార్కుల చొప్పున కేటాయించారు. జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ నుంచి 100, కెమిస్ట్రీ నుంచి 60, జనరల్ సైన్స్ నుంచి 40, చరిత్ర, స్వాతంత్రోద్యమాలు తదితరాల నుంచి 80, జాగ్రఫి నుంచి 80, కరెంట్​ ఎఫైర్స్​ నుంచి 40 మార్కులకు ప్రశ్నలడుగుతారు. నెగెటివ్​ మార్కులు ఉంటాయి. కరెంట్​ ఎఫైర్స్​ మినహా మిగతా ప్రశ్నలు దాదాపు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఎన్‌‌సీఈఆర్‌‌టీ బుక్స్​ నుంచే వచ్చే చాన్స్​ ఉంది. ఇంటెలిజెన్స్​ & పర్సనాలిటీ టెస్ట్​ రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్వీస్​ సెలెక్షన్​ బోర్డ్​ రెండు దశల్లో ఇంటెలిజెన్స్​ & పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది.  స్టేజ్​ 1లో ఆఫీసర్​ ఇంటెలిజెన్స్​ రేటింగ్​(ఓఐఆర్​), పిక్చర్​ పర్సెప్షన్​ & డిస్క్రిప్షన్​ టెస్ట్​లు రెండు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్​ 2లో ఇంటర్వ్యూ, గ్రూప్​ టెస్టింగ్​ ఆఫీసర్ టాస్కులు, సైకాలజీ టెస్టులు నిర్వహిస్తారు.​  అభ్యర్థి పర్సనాలిటీని ఇంటర్య్వూ ఆఫీసర్(ఐవో), గ్రూప్​ టెస్టింగ్​ ఆఫీసర్​(జీటీవో), సైకాలజిస్ట్​ ఇలా ముగ్గురు అభ్యర్థి ఫర్ఫార్మెన్స్​ అంచనా వేసి మార్కులు ఇస్తారు. ఇలా అన్ని దశల్లో మెరిట్​ చూపిన వారు ఫైనల్​గా సెలెక్ట్​ అవుతారు. గ్రాడ్యుయేషన్​ విత్​ ట్రైనింగ్​.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక‌‌వుతారు. అలా ఎంపికైన‌‌వారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చ‌‌ద‌‌వ‌‌చ్చు. అకడమిక్ కోర్సు, ఫిజికల్ ట్రైనింగ్​ విజయవంతంగా పూర్తి చేసిన వారికి న్యూఢిల్లీలోని జ‌‌వ‌‌హ‌‌ర్‌‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ డిగ్రీలు ఇస్తుంది.  ఫైనల్​గా సెలెక్ట్​ అయిన అభ్యర్థులకు నేష‌‌న‌‌ల్ డిఫెన్స్ అకాడ‌‌మీ పుణెలో ఎడ్యుకేషన్​, ట్రైనింగ్​ ఉంటాయి. అనంత‌‌రం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌‌లోని ఇండియ‌‌న్ మిల‌‌ట‌‌రీ అకాడ‌‌మీకి, నేవ‌‌ల్‌‌‌‌ క్యాడెట్లను ఎజిమ‌‌ల‌‌లోని ఇండియ‌‌న్ నావ‌‌ల్ అకాడ‌‌మీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైద‌‌రాబాద్‌‌లోని ఇండియ‌‌న్ ఎయిర్ ఫోర్స్ అకాడ‌‌మీకి సంబంధిత ట్రేడ్ ట్రైనింగ్​ కోసం పంపుతారు. స్టైఫండ్​ సెలెక్ట్​ అయిన అభ్యర్థి విభాగాన్ని బ‌‌ట్టి ట్రైనింగ్​ ఏడాది నుంచి 18 నెల‌‌ల వ‌‌ర‌‌కు ఉంటుంది. ట్రైనింగ్​ టైం లో నెల‌‌కు రూ.56,100 స్టైఫండ్ ఇస్తారు. కోర్సు సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకున్న వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. అప్పుడు నెలకు రూ.ల‌‌క్ష పైనే సాలరీ ఉంటుంది. దీంతోపాటు వివిధ రకాల ప్రోత్సాహకాలు, అలవెన్సులు అందుతాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ స్టార్ట్​ అవుతుంది. రెండేళ్లు, ఆరేళ్లు, పదమూడేళ్ల సర్వీస్ తో ప్రమోషన్లు పొంద‌‌వచ్చు. భవిష్యత్తులో సంబంధిత విభాగానికి చీఫ్ అయ్యే అవకాశాలూ ఉంటాయి. స్టడీ టిప్స్​ 8,9,10,11,12 తరగతుల ఎన్​సీఈఆర్​టీ బుక్స్​ తప్పనిసరిగా చదవాలి. ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించి పాఠ్యాంశాలపై కమాండ్​ సాధించాలి. అలా పట్టు సాధిస్తే ప్రశ్న ఏ విధంగా అడిగినా ఈజీగా ఆన్సర్​ చేయొచ్చు. ప్రీవియస్​ పేపర్స్​ పరిశీలిస్తే ఎగ్జామ్​ ప్యాటర్న్​తోపాటు ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది. వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్​లు రాస్తే స్పీడ్​, అక్యూరసీ పెరుగుతుంది. ఈ ఎగ్జామ్​లో నెగెటివ్​ మార్కులు ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్​ అందుకు తగినట్లుగానే స్టార్ట్​ చేయాలి. కరెంట్​ ఎఫైర్స్​, ఇంగ్లిష్​ కోసం ఇంగ్లిష్​ డైలి న్యూస్​ పేపర్స్​ ఫాలో కావాలి. ఎగ్జామ్​ ప్యాటర్న్​ సబ్జెక్ట్​ ప్రశ్నలు మార్క్స్​ టైం(ని.) మ్యాథ్స్​ 120 300 150 జనరల్​ ఎబిలిటీ టెస్ట్​ 150 600 150 ఖాళీలు: 400 ఎన్​డీఏ–370 (ఆర్మీ–208, నావీ–42, ఎయిర్​ఫోర్స్​–120) నావల్​ అకాడమీ (10+2 కాడెట్​ ఎంట్రీ స్కీమ్​)–30 వయసు: 15.7 నుంచి 18.7 సంవత్సరాల మధ్య ఉండాలి. ద‌‌ర‌‌ఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో.. అప్లికేషన్​ ఫీజు: రూ.100 ఎగ్జామ్​ తేది: 18 ఏప్రిల్​ 2021 ఆన్‌‌లైన్ ద‌‌ర‌‌ఖాస్తుకు చివ‌‌రి తేది: 19 జనవరి 2021 ఎగ్జామ్​ సెంటర్స్: తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో ఉన్నాయి. వెబ్​సైట్​: upsc.gov.in