
దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. స్వీట్ షాపులు, క్రాకర్స్ షాపులు మాత్రమే కాకుండా పూల మార్కెట్లలో కూడా దీపావళి సందడి కనిపిస్తోంది. సోమవారం ( అక్టోబర్ 20 ) దీపావళి సందర్భంగా హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో రద్దీ నెలకొంది దీపావళి సందడి నెలకొంది. ఉదయం నుంచి పూల మార్కెట్లో బారులు తీరారు జనం. పూజ కోసం, అలంకరణ కోసం రకరకాల పూలు కొనేందుకు మార్కెట్లకు క్యూ కట్టారు పబ్లిక్.
షాపులు డెకరేట్ చేయడానికి రకరకాల డిజైన్ లో అల్లిన దండలను కొంటున్నారు పబ్లిక్. హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలకు కూడా ఈ మార్కెట్ నుండి పూలు ఎగుమతి అవుతుంటాయి. బయట మార్కెట్ తో పోలిస్తే.. గుడిమల్కాపూర్ మార్కెట్ లో రేట్లు రీజనబుల్ గా ఉండటంతో జనం ఎక్కువగా వస్తుంటారు. పూలు మాత్రమే కాకుండా గుమ్మడికాయలు, దిష్టి బొమ్మలు అరటి ఆకులతో నిండిపోయాయి మార్కెట్లు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో రాత్రి పది గంటల తర్వాత పటాకులు కాల్చకూడదని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలని నగర పోలీసులు సూచిస్తున్నారు. వాయు, ధ్వని కాలుష్యం తగ్గించడానికి గతంలో సుప్రీం కోర్టు గైడ్లైన్స్ప్రకటించిందని, నగర ప్రజలు వాటిని తప్పకుండా పాటించాలని ప్రకటించారు.
నిర్ణీత సమయం తర్వాత పటాకులు కాల్చినట్టు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లపై క్రాకర్స్కాల్చి న్యూసెన్స్చేస్తే యాక్షన్తప్పదన్నారు. భారీ శబ్ధాలు వచ్చే పటాకులు కాల్చి సౌండ్ పొల్యూషన్ కు కారణం కావొద్దన్నారు.