ధర్మం కోసం పోరాడిన వీర వనితలు వన దేవతలు : గిరి సిద్దేశ్వర నందగిరి మహరాజ్

ధర్మం కోసం పోరాడిన వీర వనితలు వన దేవతలు  : గిరి సిద్దేశ్వర నందగిరి మహరాజ్
  • దస్తగిరి పీఠాధిపతులు
  • సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకున్న స్వామీజీలు

తాడ్వాయి, వెలుగు: ధర్మం కోసం పోరాడిన వీర వనితలు సమ్మక్క, సారలమ్మ, వనదేవతలని, వారి స్ఫూర్తి అందరికీ ఆదర్శమని దస్తగిరి పీఠాధిపతి అవధూత గిరి సిద్దేశ్వర నందగిరి మహరాజ్​ అన్నారు. ఆదివారం మేడారం సమ్మక్క, సారక్క ఆలయాన్ని సంగారెడ్డి జిల్లా గురహ సంఘం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహరాజ్, మహామండలేశ్వర్ సిద్దేశ్వర నందగిరి మహరాజ్ సందర్శించి అమ్మవార్ల గద్దెల వద్ద ఆదివాసి ఆచార సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. 

అనంతరం మహా జాతరను పురస్కరించుకొని జాతర పరిసరాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేండ్లకోసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ మహా జాతర నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లు అభినందనీయమన్నారు. అంతకుముందు పీఠాధిపతులకు ఎండోమెంట్ అధికారులు వినయ్ కుమార్, మధుసూదన్, అర్చకులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎండోమెంట్ సిబ్బంది, పూజారులు తదితరులు పాల్గొన్నారు.