
నేరడిగొండ , వెలుగు : ఆదివాసీల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని బోథ్ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలం లింగట్లలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొని నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని సూచించారు.
ఆదివాసీల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, దండారి చెక్కులను త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. ఆదివాసీలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గుస్సాడీలతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మల్లేష్, భీమ్ రావు, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడే వసంత్ రావు, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిత్రే నారాయణ్ సింగ్, మాజీ ఎంపీపీ ప్రేమ్ సింగ్, ఏలేటి రాజశేఖర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు .