కార్మికుల హక్కులను కాలరాస్తోన్న కేంద్రం : సింగరేణి జాతీయ కార్మిక సంఘాల నేతలు

కార్మికుల హక్కులను కాలరాస్తోన్న కేంద్రం : సింగరేణి జాతీయ కార్మిక సంఘాల నేతలు
  • సింగరేణి జాతీయ కార్మిక సంఘాల నేతలు 
  • కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్​ ఎదుట యూనియన్ల నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని జాతీయ కార్మిక సంఘాల రాష్ట్ర లీడర్ల విమర్శించారు. లేబర్​ కోడ్​లపై కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో జాతీయ కార్మిక సంఘాల నేతలతో ఆదివారం నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం హెడ్డాఫీస్​ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ, సీఐటీయూ సంఘాల రాష్ట్ర నేతల మాట్లాడారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్​లకు మేలు కలిగేలా చట్టాలను తీసుకువస్తోందని ఆరోపించారు. సింగరేణిని ప్రయివేటీకరించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతొందని ఆరోపించారు. నాలుగు లేబర్​ కోడ్​లను రద్దు చేసేంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రోగ్రాంలో ఆయా యూనియన్ల స్టేట్​ లీడర్లు మందా నర్సింహరావు, వంగా వెంకట్, త్యాగరాజన్​, రమణమూర్తి, రాము, కృష్ణయ్య, ఆల్బర్ట్​, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.