
హైదరాబాద్, వెలుగు: మనదేశంలో పది వేల మంది అంతర్జాతీయ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యూనిక్ హైర్ అనే అంతర్జాతీయ ఐటీ కన్సల్టింగ్, సేవల సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోకి తన సేవలను విస్తరించింది.
పది వేల మంది అంతర్జాతీయ అభ్యర్థులకు స్కిల్స్ నేర్పించి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసియా, మిడిల్ఈస్ట్, ఇతర దేశాల్లోని పలు యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని యూనిక్హైర్ తెలిపింది.
స్టూడెంట్లకు ట్రైనింగ్ఇచ్చి, టెక్నాలజీ రంగంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ఫలితంగా భారతీయ స్టార్టప్‌లు, ఎస్ఎంఈలకు అంతర్జాతీయ నిపుణులతో పనిచేసే అవకాశం దొరుకుతుందని పేర్కొంది.