అడిగింది రూ.1164 కోట్లు..ఇచ్చింది రూ.480 కోట్లు

అడిగింది రూ.1164 కోట్లు..ఇచ్చింది రూ.480 కోట్లు

రాష్ట్రంలో యూనివర్సిటీలకు కోలుకోలేని దెబ్బతగిలింది. ప్రైవేటు యూనివర్సిటీల రాకతో సర్కారీ యూనివర్సిటీల అభివృద్ధికి, ప్రభుత్వం ఈ ఏడాది పైసా కేటాయించలేదు. 2019-–20 విద్యాసంవత్సరానికి స్టేట్‌ లో 8 సాంప్రదాయ యూనివర్సిటీలకు రూ.1,164 కోట్లు అడిగి తే, ప్రభుత్వం కేవలం రూ.480.52 కోట్ల నిధులను బడ్జెట్‌ లో ప్రతిపాదించింది. ఇవన్నీ దాదాపు నిర్వహణ పద్దు కింద కేటాయించిన నిధులే కావడం గమనార్హం. ఒక్క ఓయూలోనే ప్రొఫెసర్లు, సిబ్బంది జీతాలకు ఏడాదికి దాదాపు రూ.500 కోట్లు అవసరమవుతాయి. కానీ మొత్తం 8 యూనివర్సిటీలకు కలపి, దా నికంటే తక్కువ నిధులు బడ్జెట్‌ లో కేటాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి . గతేడాది యూనివర్సిటీలకు నిర్వహణ పద్దు కింద రూ.485.18 కోట్లు,ప్రగతిపద్దు కింద రూ.210.32 కోట్లను ప్రతిపాదించింది. వీటిలో రూ.546.51 కోట్లను మాత్రమే రిలీజ్‌ చేసింది. అయితే గతేడాది వర్సిటీలకు రిలీజ్‌ చేసిన నిధులనే, ఈ ఏడాది కూడా కేటాయించింది. తెలుగు యూనివర్సిటీకి రూ.3 కోట్లు మినహా, ఏ వర్సిటీకి  ప్రగతిపద్దు కింద నిధులు కేటాయించలేదు.