Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. నేడు ఊహించనంత పెరిగిన గోల్డ్, హైదరాబాదులో తులం..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. నేడు ఊహించనంత పెరిగిన గోల్డ్, హైదరాబాదులో తులం..

Gold Price Today: గతవారం క్రమంగా తగ్గుతూ వినియోగదారులకు ఊరటను కలిగించిన పసిడి ధరలు నేడు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఇండియా-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్లలోనూ ర్యాలీని ప్రేరేపిస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రిటైల్ ధరలను పరిశీలించాకే షాపింగ్ చేయటం ఉత్తమం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.25వేల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 025, ముంబైలో రూ.9వేల 025, దిల్లీలో రూ.9వేల 040, కలకత్తాలో రూ.9వేల 025, బెంగళూరులో రూ.9వేల 025, కేరళలో రూ.9వేల 025, పూణేలో రూ.9వేల 025, వడోదరలో రూ.9వేల 030, అహ్మదాబాదులో రూ.9వేల 030, జైపూరులో రూ.8వేల 791, మంగళూరులో రూ.9వేల 025, నాశిక్ లో రూ.9వేల 028, అయోధ్యలో రూ.9వేల 040, బళ్లారిలో రూ.9వేల 025, గురుగ్రాములో రూ.9వేల 040, నోయిడాలో రూ.9వేల 040 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

►ALSO READ | చివరి 6 నెలల్లో 25 టన్నుల బంగారం కొన్న ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.27వేల 300 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 846, ముంబైలో రూ.9వేల 846, దిల్లీలో రూ.9వేల 861, కలకత్తాలో రూ.9వేల 846, బెంగళూరులో రూ.9వేల 846, కేరళలో రూ.9వేల 846, పూణేలో రూ.9వేల 846, వడోదరలో రూ.9వేల 851, అహ్మదాబాదులో రూ.9వేల 851, జైపూరులో రూ.9వేల 589, మంగళూరులో రూ.9వేల 846, నాశిక్ లో రూ.9వేల 849, అయోధ్యలో రూ.9వేల 861, బళ్లారిలో రూ.9వేల 846, గురుగ్రాములో రూ.9వేల 861, నోయిడాలో రూ.9వేల 861గా ఉన్నాయి. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9వేల 025 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు రూ.9వేల846గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 తగ్గి రూ.లక్ష 7వేల 900 వద్ద కొనసాగుతున్నాయి.