
భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్మీటింగ్రసాభాసగా జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు నారాయణ్‌రావు పటేల్, విఠల్ రెడ్డి వర్గీ యులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ వాదులాడుకున్నారు. భైంసాలో మంగళవారం జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ సన్నాహాక సమావేశానికి పీసీసీ పరిశీలకులు ఎండీ అవేజ్, చంద్రశేఖర్ గౌడ్ హాజరయ్యారు. అయితే బాసర మాజీ సర్పంచ్మమ్మాయి రమేశ్.. విఠల్ రెడ్డి వర్గీయులపై చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విఠల్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. వేదిక వద్దకు దూసుకొచ్చి నిరసన చేపట్టారు.
దీంతో నారాయణ్‌రావు పటేల్ వర్గీయులు సైతం వేదిక వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. పరిశీలకుల ముదే ఇరు వర్గాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు చేసుకుంటూ తోపులాటకు దిగారు. చివరకు ఏఎంసీ చైర్మన్ఆనంద్ రావు పటేల్ ఇరు వర్గాలను సముదాయించి శాంతింపజేశారు. ఆ తర్వాత మాజీ జడ్పీటీసీ సూర్యంరెడ్డి మాట్లాడుతుండగా.. పీసీసీ పరిశీకుడు ఎండీ ఆవేజ్ ఆయనను నిలువరించే ప్రయత్నం చేయడంతో విఠల్ రెడ్డి వర్గీయులు అభ్యంతరం తెలిపారు. మీటింగ్ సజావుగా సాగనివ్వకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించగా ఆయనను చుట్టుముట్టి నిలదీశారు. పరిస్థితి చేయిదాటిపోతుండగా మరో పరిశీలకుడు చంద్రశేఖర్ గౌడ్ ఆగ్రహానికి గురై అందరూ సంయమనం పాటించాలని హెచ్చరిం చారు. దీంతో సమావేశం ప్రారంభమైంది.
సంస్థాగతంగా బలోపేతం కావాలి: పరిశీలకులు
గత పదేండ్లపాటు ఆటుపోట్లకు గురై కష్టాలను ఎదుర్కొన్న కాంగ్రెస్ శ్రేణులు సంస్థాగతంగా బలోపేతమైతేనే మంచి భవిష్యత్ ఉంటుందని పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్, ఆవేజ్అన్నారు. పార్టీ అధిష్ఠానం కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు చేపట్టిందన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్ఠతకు కార్యచరణ రూపొందించినట్లు చెప్పారు. శ్రేణులు భేదాభిప్రాయాలు వీడి సంస్థాగత కార్యక్రమాలను ఐక్యతతో నిర్వహించుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యలో అమలవుతున్న సంక్షేమం, ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ రూల్స్‌కు విరుద్ధంగా వెళ్తే ఎంతటి వారైనా ఉపేక్షించబో మని హెచ్చరించారు.