న్యూఢిల్లీ, వెలుగు: చట్టం ముందు అందరూ సమాన మే అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవల హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావును విచారణ కోసం పిలిచారని, అదే క్రమంలో కేసీఆర్ ను కూడా సిట్ పిలించిందని తెలిపారు. అంతేకానీ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంలో కొత్తేమి లేదని చెప్పారు. పోలీసులకు లభించిన ఆధారాలను బట్టి వారు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా.. చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ స్కీమ్‌కు వీబీజీ రామ్ జీ అని పేరు పెట్టడం మహాత్మా గాంధీని అవమానపరిచినట్టేనని మండిపడ్డారు.
