మంచిర్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో టాస్క్​ఫోర్స్ కమిటీ తనిఖీలు

మంచిర్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో టాస్క్​ఫోర్స్ కమిటీ తనిఖీలు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్​ఫోర్స్ కమిటీ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని, చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్​వో డాక్టర్ హరీశ్ రాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న మందుల వివరాలు, ఆహారం గురించి అడిగి తెలుసుకున్నామన్నారు. 

బ్రేక్​ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నారో లేదో తెలుసుకోవడంతో పాటు రోగులను 20 రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలను నమోదు చేశామన్నారు. కిచెన్​ను తనిఖీ చేసి సూచనలు చేశారు. డాక్టర్ భీష్మ, ఆర్ఎంవో ప్రసాద్,  ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలాజీ లింగారెడ్డి,  బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.