
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల పిల్లల్లో దాగిఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు సింగరేణి యాజమాన్యం సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ నిర్వస్తోందని మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్ అన్నారు. డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, సోమగూడెంలో నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను మంగళవారం సాయంత్రం మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో జీఎం ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. 25 రోజుల పాటు వాలీబాల్, బాస్కెల్బాల్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్‌పై కార్మికుల పిల్లలకు కోచ్‌ల ద్వారా ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఈ క్యాంపును పిల్లలు సద్వినియోగం చేసుకొని స్పోర్ట్స్‌లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటు జీఎం విజయప్రసాద్, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సత్యనారాయణ, ఆఫీసర్స్అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేశ్, పర్సనల్ మేనేజర్శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి ఎం.కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.