మిస్ వరల్డ్ పోటీలపై డైలమా : యుద్ధం ఉద్రిక్తతలతో నిర్వాహకుల్లో ఆందోళన

మిస్ వరల్డ్ పోటీలపై డైలమా : యుద్ధం ఉద్రిక్తతలతో నిర్వాహకుల్లో ఆందోళన

పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఇండియా ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ ఉదృతంగా సాగుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియా యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తుంది. ఇదే క్రమంలోనే భారతదేశం దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. దేశంలోని విమాన సర్వీసుల అంతరాయం ఏర్పడింది. చాలా ఎయిర్ పోర్టులను మూసివేసింది భారత్. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై డైలమా ఏర్పడింది. 120 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న క్రమంలోనే.. భారత్ లో పోటీల నిర్వహణ విషయంలో నిర్వాహకులు సందిగ్ధంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.

72వ మిస్ వరల్డ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది... ఇవాళ ( మే 7 ) ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు మే 31 దాకా జరగనున్నాయి. అయితే.. భారత్ పాక్ మధ్య యుద్దవాతావరణం నెలకొన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్థత నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు షెడ్యూల్ మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న క్రమంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై డైలమాలో పడ్డారు నిర్వాహకులు. షెడ్యూల్ మార్పుపై ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ రాకతో హైదరాబాద్ సందడిగా మారింది. మే 10న గచ్చిబౌలిలో మిస్ వర్డల్ ఓపెనింగ్ సెర్మనీ, 31న మిస్ వరల్డ్ గ్రాండ్​ఫినాలె జరగనుంది. మధ్యలో తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ ​చేసేలా వివిధ ప్రాంతాల్లో రకరకాల ఈవెంట్లు ప్లాన్ చేశారు నిర్వాహకులు. మే 10న తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే కంటెస్టెంట్లకు తెలంగాణ ఆటపాటలతో గ్రాండ్ వెల్కమ్ పలకనున్నారు.

మే 12, 13న కంటెస్టెంట్ల స్పిరిచ్యువల్ టూర్, నాగార్జున సాగర్ బుద్ధవనం సందర్శనతో పాటు హైదరాబాద్ హెరిటేజ్ వాక్. మే 13న చౌమహల్లా ప్యాలెస్ విజిట్, మే 14న కాకతీయ హెరిటేజ్ ట్రిప్ వరంగల్, రామప్ప ఆలయ సందర్శన. మే 15న యాదగిరిగుట్ట ఆలయ దర్శనం.. అదేరోజు పోచంపల్లి హ్యాండ్ లూమ్ టూర్ ప్లాన్ చేశారు నిర్వాహకులు.మరి, భారత్ పాక్ మధ్య తాజా పరిస్థితుల దృష్ట్యా మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు ఉంటాయో వేచి చూడాలి.