అన్‌లాక్ 4: బడులు బందే… మెట్రో రైళ్లకు ఒకే

అన్‌లాక్ 4: బడులు బందే… మెట్రో రైళ్లకు ఒకే

ఢిల్లీ: ఆన్ లాక్‌డౌన్ 4 కు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దశలవారీ విధానంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిది. అయితే కంటైన్‌మెంట్ జోన్స్‌లో లాక్‌డౌన్ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకూ అమలులో ఉంటాయని తెలిపింది. దానికి సంబందించి మార్గదర్శకాలను కేంద్ర పట్టణాబివృద్ది శాఖ, కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ విడుద‌ల‌ చేయనుంది

సెప్టెంబర్ 21 నుంచి సోషల్, ఆకాడమీ, స్పోర్ట్స్, ఎంటర్ టైన్‌మెంట్, కల్చర్, రీలిజియన్, పోలిటికల్, పంక్షన్ కార్యక్రమాలకు అనుమ‌తినిచ్చింది. అయితే.. తప్పకుండా మాస్కులు ధ‌రించేలా ,సామాజిక దూరం పాటించేలా వంద మందికి మాత్రమే అనుమతినిచ్చింది. ప్రతి ఒక్కరికీ థ‌ర్మల్ స్క్రినింగ్, తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలని తెలిపింది.

స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్స్ తెరవడానికి వీల్లేదని, సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలు అన్ని మూసే ఉండాలని తెలిపింది. అంతర్ రాష్ట్ర రవాణాకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. అంతర్జాతీయ విమానా ప్రయాణాలను అనుమతించమ‌ని తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న‌ట్టు తెలిపింది.
చిన్నారులు, గర్బీణీలు, వృద్దులు ఇళ్లకే పరిమితం కావాల‌ని, కేవలం అత్యవసరమైతేనే బయటకు రావాలని కేంద్రం తెలిపింది.