ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో.. ఏదైనా చేయొచ్చు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో.. ఏదైనా చేయొచ్చు

ఏఐ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన డైలీ రొటీన్‌‌‌‌‌‌‌‌లో భాగమైంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజూ ఏదో ఒక టైంలో ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌ని వాడుతున్నారు. అయితే.. మనం రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాడే చాట్‌‌‌‌‌‌‌‌ జీపీటీ, గ్రోక్‌‌‌‌‌‌‌‌, జెమినితో పాటు మనకు ఉపయోగపడే చాలా రకాల ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉన్నాయి.  ఇవి ప్రొడక్టివిటీ, ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్, క్రియేటివిటీ.. పెంచడంలో ఎంతో సాయంచేస్తాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి. 

రీక్లెయిమ్‌‌‌‌‌‌‌‌

ఇది క్రోమ్‌‌‌‌‌‌‌‌కి యాడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోగలిగే ఒక ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌‌‌‌‌‌. స్మార్ట్ క్యాలెండర్ షెడ్యూలర్​లా పనిచేస్తుంది. ఆఫీస్ టైంలో ఉండే మీటింగ్స్, షెడ్యూల్స్, బ్రేక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రతి విషయాన్ని ఇది ప్రయారిటీల ఆధారంగా ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా షెడ్యూల్ చేస్తుంది. గూగుల్‌‌‌‌‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అవుట్‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌తో ఇంటిగ్రేట్ అయ్యి పనిచేస్తుంది. మీటింగ్స్, ఫోకస్ టైమ్, హ్యాబిట్స్‌‌‌‌‌‌‌‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. 

మ్యూబెర్ట్

ఇది రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ జెనరేటర్. దీంతో రకరకాల సౌండ్ ట్రాక్స్, మ్యూజిక్ బిట్స్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి మ్యూజిక్ కావాలో ప్రాంప్ట్‌‌‌‌‌‌‌‌ ఇస్తే చాలు.. ఇది కొన్ని మిలియన్స్ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ శాంపిల్స్​ని ఉపయోగించి కస్టమ్ ట్రాక్స్ క్రియేట్ చేస్తుంది. వీడియోలు, పాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌లు, డైలీ రిలాక్సేషన్స్‌‌‌‌‌‌‌‌కు అవి పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా సరిపోతాయి. ఇది జెనరేట్‌‌‌‌‌‌‌‌ చేసేది కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ కాబట్టి కంటెంట్ క్రియేటర్స్‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి సమస్యలు ఉండవు. 

 గ్రోకిపీడియా

ఎలాన్ మస్క్ కంపెనీ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌ఏఐ’ నుంచి వచ్చిన గ్రోక్‌‌‌‌‌‌‌‌ ఎంతలా సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యిందో అందరికీ తెలుసు. అదే కంపెనీ ఇప్పుడు గ్రోకిపీడియా అనే కొత్త ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఎన్‌‌‌‌‌‌‌‌సైక్లోపీడియాను తీసుకొచ్చింది. దీనికి వికీపీడియాతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ రెండు ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ల మధ్య చాలా తేడాలు కూడా ఉన్నాయి. ఇది ఏఐ చాట్​ బాట్​ గ్రోక్​తో పనిచేస్తుంది. రకరకాల సోర్స్​ నుంచి సేకరించిన సమాచారాన్ని ఏఐతో ప్రాసెస్ చేసి యూజర్లకు అందిస్తుంది. 

ఇందులో ప్రస్తుతం 8,85,000కు పైగా వ్యాసాలు ఉన్నాయి. గ్రోక్‌‌‌‌‌‌‌‌లా కాకుండా ఇందులో కీవర్డ్ సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకు ‘అమెరికా’ అని టైప్‌‌‌‌‌‌‌‌ చేస్తే ఆ దేశానికి సంబంధించిన పూర్తి సమాచారం చూపిస్తుంది. వికీపీడియాలా ఇందులో ఫొటోలు ఉండవు. కేవలం టెక్స్ట్‌‌‌‌‌‌‌‌ మాత్రమే చూపిస్తుంది. అంతేకాదు.. వికీపీడియాలా ఇందులో వ్యాసాలను ఎడిట్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం లేదు. కానీ.. కొంత సమాచారం మాత్రం వికీపీడియా నుంచి తీసుకున్నారు. అందుకే కొన్ని పేజీల్లో ‘‘వికీపీడియా నుంచి తీసుకున్నది” అని డిస్‌‌‌‌‌‌‌‌ప్లే అవుతోంది.  

పాప్‌‌‌‌‌‌‌‌ ఏఐ 

ఇందులో పీడీఎఫ్‌‌‌‌‌‌‌‌లు, ఇమేజ్‌‌‌‌‌‌‌‌లు, డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌ లాంటివి అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేస్తే వాటితో ప్రెజెంటేషన్స్, కంటెంట్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్ చేసి ఇస్తుంది. కానీ.. అందుకోసం సరైన ప్రాంప్ట్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఫైల్స్ అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి..  ‘‘ఈ పీడీఎఫ్‌‌‌‌‌‌‌‌ సమ్మరీ చెప్పు’’ లేదా ‘‘ప్రెజెంటేషన్ క్రియేట్ చెయ్‌‌‌‌‌‌‌‌” అని ప్రాంప్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. దీన్ని ఉపయోగించి అకడమిక్ స్టడీస్​కు సంబంధించిన నోట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.

జిమ్‌‌‌‌‌‌‌‌ బడ్డీ 

ఇది ఏఐ -బేస్డ్ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ యాప్. ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌, బరువు, డైలీ రొటీన్, మన దగ్గరున్న ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ వివరాలు ఇస్తే.. వాటి ఆధారంగా కస్టమ్ వర్కౌట్ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్ చేస్తుంది. ఈ టూల్‌‌‌‌‌‌‌‌ని బిగినర్స్ నుంచి అథ్లెట్స్ వరకు అందరూ వాడొచ్చు. ప్రొఫైల్ సెటప్ చేసి ప్రాంప్ట్ ఇచ్చినా ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ చేస్తుంది. ఉదా: ‘‘హోమ్ వర్కౌట్ 30 నిమిషాలు” అని ప్రాంప్ట్‌‌‌‌‌‌‌‌ ఇస్తే.. మన దగ్గర ఉన్న ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో 30 నిమిషాల్లో ఎలాంటి ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌లు చేయొచ్చు? ఎలా చేయాలి? అనేది చెప్తుంది. పైగా 24/7 పర్సనల్ ట్రైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా సపోర్ట్, మోటివేషనల్‌ బూస్ట్ ఇస్తూ ప్రోగ్రెస్ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. 

ట్రిప్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌

ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్లు సెలవులు దొరికితే ఇంటికి దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటారు. కానీ.. సరైన ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో వెనుకడుగు వేస్తారు. అలాంటివాళ్లకు ట్రిప్ క్లబ్ టూల్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి మనం ఎప్పుడు, ఏ డెస్టినేషన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలి అనుకుంటున్నామో చెప్తే  ఆ లొకేషన్‌‌‌‌‌‌‌‌ వివరాలు, బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఫర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ టూర్​ ప్లాన్​ని రెడీ చేసి ఇస్తుంది. 

ల్యూమా ఏఐ 

ఇది రెయ్3, డ్రీమ్ మెషిన్ మోడల్స్‌‌‌‌‌‌‌‌తో పనిచేసే ఏఐ  వీడియో జెనరేషన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం. టెక్స్ట్, ఇమేజ్‌‌‌‌‌‌‌‌ల నుంచి త్రీడీ మోడల్స్, వీడియోలు తయారు చేస్తుంది. అంతేకాదు.. సాధారణ వీడియోలను కూడా ఇది త్రీడీ వీడియోలుగా మార్చేస్తుంది. 

గీతా జీపీటీ

ఇది ఏఐతో భగవద్గీతలోని విషయాల్ని అందించే చాట్‌‌‌‌‌‌‌‌బాట్. జీవితంలోని సమస్యలను దానికి చెప్తే అది ఆ సమస్యలకు అనుగుణంగా గీతా సారాన్ని చెప్పి మోటివేట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. అందులోని శ్లోకాలు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. భగవద్గీతకు సంబంధించిన డౌట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా ఇది క్లియర్ చేస్తుంది.

సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీమ్‌‌‌‌‌‌‌‌ ఏఐ 

టెక్స్ట్ నుంచి మీమ్స్ జనరేట్ చేసే ఫన్ టూల్ ఇది. టెక్స్ట్ ప్రాంప్ట్‌‌‌‌‌‌‌‌లు ఇస్తే జిఫ్‌‌‌‌‌‌‌‌లు, మల్టీ-ప్యానెల్ మీమ్స్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్ చేస్తుంది. ప్రపంచంలోని 110 కంటే ఎక్కువ భాషలు ఇందులో ఉంటాయి. పెద్దగా కష్టపడకుండానే సోషల్ మీడియా, మార్కెటింగ్, ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో షేర్ చేయడానికి రకరకాల మీమ్స్‌‌‌‌‌‌‌‌ని దీనిద్వారా జనరేట్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. 

డ్యూరబుల్‌‌‌‌‌‌‌‌ 

కొంతమంది చిన్నచిన్న బిజినెస్​లు చేసేవాళ్లు కూడా సొంతంగా వెబ్​సైట్ డిజైన్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్లకు ఈ డ్యూరబుల్ ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో బిజినెస్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు 30 సెకన్లలో వెబ్‌‌‌‌‌‌‌‌ సైట్‌ని క్రియేట్‌ చేస్తుంది. నిమిషాల్లోనే దాన్ని మనకు నచ్చినట్టు మార్చేస్తుంది. ఇందులో మార్కెటింగ్, ఇన్‌‌‌‌‌‌‌‌వాయిసింగ్ టూల్స్ కూడా ఉంటాయి. 

ఆటోడ్రా ఏఐ 

ఇది మెషిన్ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌తో డ్రాయింగ్స్ వేసే టూల్. రఫ్ స్కెచ్‌‌‌‌‌‌‌‌లను కూడా ప్రొఫెషనల్ ఇలస్ట్రేషన్స్‌‌‌‌‌‌‌‌గా మారుస్తుంది. డ్రాయింగ్‌‌‌‌‌‌‌‌ చేయలేనివాళ్లు తమ మనస్సులోని భావాలను దీనికి చెప్తే బొమ్మ గీసి ఇస్తుంది.