ఒడిశా మాస్టర్స్‌‌‌‌ టోర్నీలో ఫైనల్‎కు దూసుకెళ్లిన ఉన్నతి, ఇషారాణి

ఒడిశా మాస్టర్స్‌‌‌‌ టోర్నీలో ఫైనల్‎కు దూసుకెళ్లిన ఉన్నతి, ఇషారాణి

కటక్‌‌‌‌‌‌‌‌: ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఉన్నతి హుడా, ఇషారాణి బారువా ఒడిశా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌సూపర్‌‌‌‌‌‌‌‌–100 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో 18 ఏళ్ల ఉన్నతి 18–21, 21–16, 21–16తో మాజీ జూనియర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ తస్నిమ్‌‌‌‌‌‌‌‌ మిర్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. గంటపాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నతి అద్భుతమైన షాట్లతో ఆకట్టుకుంది. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో ఓడినా తర్వాతి రెండు గేమ్‌‌‌‌‌‌‌‌ల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టింది. 

మరో సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఇషారాణి 18–21, 21–7, 21–7తో తన్వి హేమంత్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ 19–21, 21–8, 18–21తో రౌనక్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించాడు. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌ రెడ్డి–రేషిక 16–21, 19–21తో ఐదోసీడ్ డేజాన్‌‌‌‌‌‌‌‌ ఫెర్డెన్సియాన్‌‌‌‌‌‌‌‌–వార్దానా (ఇండోనేసియా) చేతిలో ఓడారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో అశ్విన్‌‌‌‌‌‌‌‌ భట్‌‌‌‌‌‌‌‌–శిఖా గౌతమ్‌‌‌‌‌‌‌‌ 13–21, 16–21తో ఆంగ్‌‌‌‌‌‌‌‌ జిన్‌‌‌‌‌‌‌‌ యీ–కార్మెన్‌‌‌‌‌‌‌‌ టాంగ్‌‌‌‌‌‌‌‌ (మలేసియా) చేతిలో కంగుతిన్నారు.