ఉక్రెయిన్ సంక్షోభ సమన్వయకర్తగా అమిన్ అవద్

ఉక్రెయిన్ సంక్షోభ సమన్వయకర్తగా అమిన్ అవద్

న్యూయార్క్: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి... ఐక్యరాజ్య సమితి సూడాన్ కు చెందిన అమిన్ అవద్ ను సమన్వయకర్తగా నియమించింది. ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ హోదాలో అమిన్ అవద్ .. రష్యా, ఉక్రెయిన్ దేశాల అధినేతలతో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపే దిశగా కృషి చేస్తారని యూఎన్వో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. కాగా.. అమిన్ అవద్ యూఎన్వోకి చెందిన పలు సంస్థల్లో పని చేశారు. యునైటెడ్ నేషన్స్ హైకమీషనర్ ఫర్ రెఫ్యూజీస్ లో సీనియర్ అధికారిగా పని చేశారు. యూఎన్హెచ్సీఆర్ ప్రతినిధిగా శ్రీలంక, ఇరాక్ తదితర దేశాల్లో ఆయన పని చేశారు.

ఇవి కూడా చదవండి:

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానం

ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా