కరెంట్ను పొదుపుగా వాడుకోండి: సీఎండీ ప్రభాకర్ రావు

కరెంట్ను పొదుపుగా వాడుకోండి: సీఎండీ ప్రభాకర్ రావు

24 గంటల ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనధికారికంగా వ్యవసాయ విద్యుత్ కోతలు అమలు చేస్తోంది. దాంట్లో  భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రెండు దఫాలుగా వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతులు కూడా 8 లేదా 9 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరుగుతోందన్నారు.. ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.  రైతులు కరెంటును పొదుపుగా వాడుకోవాలని కోరారు.డిమాండుకు తగ్గట్టు కరెంటిస్తామంటూనే పొదుపు చేసుకోవాలని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సూచిస్తున్నారు. రైతులు దయచేసి ఆటోమేటిక్ స్టార్టర్లు వాడొద్దని కోరారు.