చైనా దూకుడుకు మన జవాన్లు కళ్లెం వేశారు

చైనా దూకుడుకు మన జవాన్లు కళ్లెం వేశారు

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత్-చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ మరోమారు స్పందించారు. చైనా దూకుడును బట్టి నేటి ప్రపంచం ఎలా మారుతుందో చెప్పొచ్చునని రాజ్‌‌నాథ్ పేర్కొన్నారు. డ్రాగన్ దూకుడును భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొందన్నారు.

‘మా హిమాలయ సైన్యంపై చైనా అప్రేరిత దూకుడును ఇప్పటి ప్రపంచం ఎలా మారుతుందోనడానికి ఉదాహరణగా చెప్పొచ్చు. గత ఒప్పందాలు ఎలా ఉల్లంఘనకు గురవుతున్నాయో, హిమాలయాలతోపాటు ఇండో-పసిఫిక్ రీజియన్‌‌లో అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అందరం చూస్తున్నాం. లడఖ్‌‌లోని ఎల్‌ఏసీ వద్ద చైనా భారీ సైన్యాన్ని మోహరించింది. ఇలాంటి సమయంలో వారిని ఎదుర్కోవడంలో మన దళాలు తెగువను చూపించాయి. పీఎల్‌‌ఏను వెనక్కి నెట్టడానికి ధైర్య, సాహసాలను ప్రదర్శించాయి’ అని రాజ్‌‌నాథ్ వివరించారు.