అప్పటివరకు ఏపీ రాజధాని అమరావతే: మంత్రి అంబటి రాంబాబు

అప్పటివరకు ఏపీ రాజధాని అమరావతే: మంత్రి అంబటి రాంబాబు

ఏపీ రాజధాని ఏది..? అమరావతా..! మూడు రాజధానులా..! ఈ ప్రశ్నకు వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు స్పష్టతనిచ్చారు. రాజ‌ధాని లేని రాష్ట్రం ఏపీ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తిప్పికొట్టారు. అమ‌రావ‌తిని తాము ఎక్క‌డికి త‌ర‌లించ‌లేద‌ని, ఆ ప్రాంతం ఏపీ రాజ‌దానిగా ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. రాజధాని ప్రాంతంపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

జనసేన పొత్తు ఎవరితో ..?

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లవి అనైతికమైన పొత్తులని మంత్రి అంబ‌టి రాంబాబు దుయ్యబట్టారు. అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉంది. బీజేపీతోనా, టీడీపీతోనా? సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయించారని.. దాన్ని ఓర్వలేక లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని రాంబాబు స్పష్టతనిచ్చారు. బీసీలకు సీటు ఇవ్వడాన్ని తట్టుకోలేని లావు ఒక బీసీ ద్రోహి అని మంత్రి ఫైర్‌ అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి అసంతృప్తులు సరిచేసుకొని పార్టీ ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. మాచ‌ర్లలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read : స్టూడియోకి స్థలం కేటాయింపు..యాత్ర 2 డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!