మెదక్‌‌లో వర్షం..కొట్టుకుపోయిన వడ్లు

మెదక్‌‌లో వర్షం..కొట్టుకుపోయిన వడ్లు

మెదక్, వెలుగు : అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలవుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. మెదక్‌‌ పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌లో రైతులు ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. పట్టణ శివారులోని పిల్లికొట్టాల వద్ద గల కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి.

వడ్లను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడ్లు కేంద్రానికి తీసుకొచ్చి నాలుగైదు రోజులు అవుతున్నా కొనుగోళ్లు జరగడం లేదని, ఆఫీసర్లు టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని కోరారు.