నస్పూర్, వెలుగు: తెలంగాణ పోరాట యోధుడు కాకా విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయమని దళిత సంఘాల నాయకులు తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కుట్రతో కాకా విగ్రహాలు ఆవిష్కరణకు దూరంగా ఉంచారని, దళితుల ఆత్మగౌరవానికి నిదర్శంగా మంతెన జగన్‌మోహన్‌రావు కాకా విగ్రహాలను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు ఖాశి సత్తీష్ మాదిగా, చిప్పకూర్తి వెంకటేష్, సిరికొండ బోస్ మాదిగ, నాయకులు సందీప్, మహేష్, రాజు, సురేష్,అంజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
