
ప్రముఖ సింగర్ సునీత(Sunitha) తన పాటలతో అందరికీ సుపరిచితమే. సునీత కుమారుడు ఆకాష్(Aakash) హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు(Raghavendra Rao) తన సొంత బ్యానర్ అయినా ఆర్.కె టెలిఫిల్మ్ షో బ్యానర్(RkTelifilm Show baner), పై `సర్కారు నౌకరి`(Sarkaru Naukari) అనే కొత్త మూవీని నిర్మించబోతున్నట్లు పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీని శేఖర్ గంగామౌని( Shekar Gangamouni) డైరెక్ట్ చేయబోతున్నాడు.
రిలీజ్ చేసిన పోస్టర్ లో సినిమా టైటిల్ తో పాటు హీరో ఆకాష్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీకు సర్కారు నౌకరి అనే పేరును ఖరారు చేసిన ఈ పోస్టర్ ఆసక్తి కలిగిస్తుంది. హీరో ఆకాష్ తన సహజ లుక్స్ తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ కలిగేలా కనిపిస్తున్నారు.
`సర్కారు నౌకరి ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో చెట్టుపై ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వేలాడుతూ కనిపించగా.. సైకిల్ పై ఉన్న హీరో లుక్ ని చూపించారు. సైకిల్ పెట్టెపై `పెద్ద రోగం..చిన్న ఉపాయం` అని రాసి ఉంది. దీంతో కథపై మరింత ఆసక్తి కలిగేలా చేశారు మేకర్స్. ఒక వ్యక్తి ఆశయంతో విప్లవం ప్రారంభమవుతుంది అంటూ మేకర్స్ ప్రస్తావించారు. పీరియాడిక్ డ్రామా లో సాగే ఈ కథతో..హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆకాష్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
ఈ మూవీ లో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్రను పోషిస్తుండగా..సూర్య- సాయి శ్రీనివాస్ వడ్లమాని- మణిచందన- రాజేశ్వరి ముళ్లపూడి- రమ్య కొల్హారి- త్రినాథ్ తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి(Suresh Bobbili) ఈ మూవీకు సంగీతం అందిస్తున్నారు. కాగా రిలీజ్ డేట్ ను త్వరలో అధికారకంగా ప్రకటించునున్నారు మేకర్స్.