యూపీలో బీజేపీకి మరో షాక్

యూపీలో బీజేపీకి మరో షాక్

లక్నో:  అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నిన్న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేయగా... ఈ రోజు మరో మినిస్టర్ కూడా రిజైన్ చేశారు. యూపీ అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ధారా సింగ్ చౌహాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మధుబన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దారాసింగ్ చౌహాన్.. గతంలో బీఎస్పీలో ఉన్నారు. ఆ పార్టీ తరపున రెండు సార్లు రాజ్యసభ, ఒకసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఓబీసీ సామాజికవర్గానికి చెందిన దారాసింగ్ చౌహాన్ 2015 ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అదే ఏడాది పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడయ్యారు. దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగుల పట్ల యోగీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటమే తన రాజీనామాకు కారణమని ధారాసింగ్ చెప్పారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన వెంటనే దారా సింగ్ చౌహాన్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ను కలిశారు. సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అటు అఖిలేష్ సైతం ధారాసింగ్ కు స్వాగతం అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే మంగళవారం  నుంచి యూపీలో ఆరుగురు నేతలు బీజేపీని వీడారు. వీరిలో స్వామి ప్రసాద్ మౌర్య, ధారా సింగ్ చౌహాన్ మంత్రులు కాగా... రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ శక్యాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

కరోనా కలకలంతో బ్యాంక్కి తాళం

ఐఐటీ హైదరాబాద్లో 119 మందికి కరోనా