యోగి ఆదిత్యనాథ్‌.. దీపావళి గిప్ట్.. గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీ

  యోగి ఆదిత్యనాథ్‌..  దీపావళి గిప్ట్..  గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం  యోగి ఆదిత్యనాథ్‌ గుడ్ న్యూస్ చెప్పారు.  రాష్ట్రంలో ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారందరికీ దీపావళీ కానుకగా ఒక గ్యాస్ సిలిండర్ ను ఉచితంగా అందించనున్నట్లుగా ప్రకటించారు.  బులంద్‌షహర్‌లో జరిగిన కార్యక్రమంలో రూ. 632 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. 

ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు పొందిన వారిందరికీ సిలిండర్‌ ధరను రూ.300 మేర తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మేము ప్రతి ఉజ్వల యోజన కనెక్షన్ లబ్ధిదారునికి దీపావళి కానుకగా ఒక వంట గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాము అని ఆదిత్యనాథ్ అన్నారు. 

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్లు పొందడం చాలా కష్టమైన పని అని ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం  ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే సుమారు 1.75 కోట్ల కుటుంబాలు ఉజ్వల పథకం ద్వారా లబ్ది పొందుతన్నాయని చెప్పారు.