ప్రధాని మోదీపై విశ్వాసానికి నిదర్శనం..బెంగాల్‌‌లో బీజేపీ గెలుపుపై యూపీ సీఎం స్పందన

ప్రధాని మోదీపై విశ్వాసానికి నిదర్శనం..బెంగాల్‌‌లో బీజేపీ గెలుపుపై యూపీ సీఎం స్పందన

లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సుప రిపాలనపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. సోమవారం 'ఎక్స్' వేదికగా  ఆయన స్పందిస్తూ ఈ ఫలితాలను చరిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు.

ఇది 'వికసిత్​ భారత్' విజన్‌‌ను మరింత వేగవంతం చేస్తుందని  ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఒక చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అస్సాంలో వరుసగా మూడోసారి, పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. గెలిచిన అభ్యర్థులకు యోగీ అభినందనలు తెలిపారు.