యూపీలో హలాల్ ఉత్పత్తులపై నిషేధం

యూపీలో హలాల్ ఉత్పత్తులపై నిషేధం

ప్రపంచవ్యాప్తంగా నకిలీల రాజ్యం నడుస్తోంది.  ఏది కొందామన్న నకిలీ సరుకులు బెంబేలెత్తిస్తున్నాయి.  ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం హలాల్ ( నకిలీ) ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి సారించింది.  హలాల్ సర్టిఫికెట్లపై వ్యాపారం చేసే దుకాణాలపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.  దీంతో  ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా  హవాలా ఉత్పత్తులను బ్యాన్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. హలాల్ సర్టిఫికెట్లతో వ్యాపారం చేయడం వలన ప్రజలు మతపరంగా కొన్ని అంశాలను లేవనెత్తుతున్నారని వచ్చిన ఆరోపణలపై లక్నో పోలీసులు కొన్ని సంస్థలపై కేసు నమోదు చేసిన... యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

చెన్నైకు చెందిన హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీసుుల తెలిపారు.  అలాగే ముంబైలోని   హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జమియత్ ఉల్లేమా, ... జమియాత్ ఉల్లేమా హింద్ హలాల్ ట్రస్ట్, న్యూఢిల్లీ సంస్థలపై ఐష్‌బాగ్‌లోని మోతీజీల్ కాలనీకి చెందిన శైలేంద్ర కుమార్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

హలాల్ సర్టిఫికెట్ లేని  కంపెనీలకు చెందిన ఉత్పత్తుల విక్రయాలు తగ్గే అవకాశం ఉందని శైలేంద్ర కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయిల్, సబ్బు, టూత్‌పేస్ట్ , తేనె వంటి శాఖాహార ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేట్‌లను జారీ చేయడం, అటువంటి ధృవీకరణ అవసరం లేని చోట, హలాల్  ఉత్పత్తుల విక్రయాలను పెంచుకొనే  లక్ష్యంగా కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  కొంతమంది మతం ముసుగులో చట్ట వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడుతూ   హలాల్ సర్టిఫెకెట్లతో లాభాలను కూడబెట్టి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారని కూడా శైలేంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

శైలేంద్ర కుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన లక్నో పోలీసులు  120B (నేరపూరిత కుట్ర), 153A (ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 298 (మతపరమైన  విద్వేషాలు వచ్చేలా చెప్పడం ), 384 (దోపిడీ) కింద కేసు నమోదు చేయబడింది. ఇంకా, 420 (మోసం), 467 ( ఫోర్జరీ సర్టిఫికెట్ ), 468 (మోసం చేసేందుకు  కోసం ఫోర్జరీ సంతకం చేయడం),  505  వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.