ట్విట్టర్ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు

V6 Velugu Posted on Jun 18, 2021

ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కు లీగల్ నోటీసులిచ్చారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. వారం రోజుల్లో లోనీ బోర్డర్ పీఎస్ కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్టర్ ఎండీ మనీశ్ మహేశ్వరిని ఆదేశించారు. కొద్దిరోజుల కిందట యూపీలోని ఘజియాబాద్ లో ముస్లిం వ్యక్తిపై దాడి జరిగింది. దాడి చేసిన టైంలో వందేమాతరం, జైశ్రీరాం అనే నినాదాలు చేశారని ఆరోపణలున్నాయి. వీడియో ట్విట్టర్ లో వైరల్ అయింది. వీడియో వైరల్ కాకుండా అడ్డుకోవడంలో ట్విట్టర్ ఫెయిల్ అయిందని పోలీసులు చెప్పారు. మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు నోటీసులు పంపారు.

Tagged Legal Notice, up police, Loni incident , Twitter India MD

Latest Videos

Subscribe Now

More News