
జహీరాబాద్, వెలుగు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ చెందిన ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు గురువారం మండలంలోని ఉగ్గేల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న పథకాలు, ఆన్లైన్విధానాన్ని వారు పరిశీలించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్థాని కఅధికారులు రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి పవర్పాయింట్ప్రజంటేషన్ ద్వారా యూపీ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, ఆపాడు సీఈఓ రాఘవేందర్ రావు,అనిల్ కుమార్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, యూపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.