ఆస్కార్ వేడుకలో ఉపాసన ధరించిన చీర, నెక్లెస్ ప్రత్యేకతలేంటంటే..

ఆస్కార్ వేడుకలో ఉపాసన ధరించిన చీర, నెక్లెస్ ప్రత్యేకతలేంటంటే..

మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ కు ఈ సారి మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. భారతీయ సినిమా ఖ్యాతిని చాటిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ లభించింది. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ టీంతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా సందడి చేశారు. అందులోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పుడూ ట్రెండీగా కనిపించే ఉపాసన.. ఈ ఆవార్డ్స్ ఫంక్షన్ లో భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలాసంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. దీంతో ఆమె వేసుకున్న నెక్లెస్, కట్టుకున్న చీరపైన అందరి దృష్టి పడింది. ఈ విషయంపై స్పందించిన ఉపాసన... సోషల్ మీడియా వేదికగా తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

హ్యాండ్ మేడ్ చీరలంటే ఇష్టమని ఉపానస చెప్పారు. ఈ చీరను జయంతి రెడ్డి అనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేసినట్టు వెల్లడించారు. ఈ సారీని రీసైకిల్ చేసిన స్క్రాప్‌ల నుండి చేశారని అందుకే దీన్ని స్క్రాప్ రీసైలిక్డ్ సిల్క్ సారీ అని పిలుస్తారని ఉపాసన తెలిపారు. అంతేకాదు ఈ చీరను చేతితో నేసిన పట్టు, స్పిన్ ఫాబ్రిక్‌తో తయారు చేయడం చెప్పుకోదగిన విషయం. ఇక తాను మెడలో ధరించిన నెక్లెస్ కూడా అవార్డ్స్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని ముంబైకి చెందిన జ్యువెల్లరీ డిజైనర్ బినా గోయెంకా రూపొందించారన్నారు. దీన్ని తయారు చేయడానికి నాలుగేళ్లు పట్టిందన్నారు. అత్యంత నాణ్యత గల సహజ రత్నాలు, ముత్యాలతో కూడిన ఈ నెక్లెస్... దాదాపు 400 క్యారెట్ల నాణ్యత గల కెంపులను కలిగి ఉంటుందని ఉపాసన తెలిపారు. దీని విలువ కోట్లలోనే ఉంటుందని టాక్ కూడా వినిపిస్తోంది.