ఇంట్లోనే కరోనా మాస్క్ ల తయారీపై ఉపాసన వీడియో

ఇంట్లోనే కరోనా మాస్క్ ల తయారీపై ఉపాసన వీడియో

ఇంట్లోని టిష్యూలతో మాస్క్ ల తయారీ…
నమస్కారంతో అంటు రోగాలకు దూరం..
శానిటైజర్ తప్పనిసరి కాదు.. సబ్బుతో కడుక్కున్నా అదే ఫలితం..

ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలోకి వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి భయపడాల్సినంతగా లేదు. వేరే దేశంలోనుంచి మన దేశంలోకి వచ్చిన వారిలో మాత్రమే కరోనా ఉన్నట్లు తేలింది. వారికి కట్టుదిట్టమైన పరిస్థితుల మధ్య వైద్యాన్ని అందజేస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రాలు కరోనాపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అయితే కరోనా రాకుండా ఉండేందుకు ప్రజలు మాస్క్ లు, శానిటైజర్స్ వాడుతున్నారు. దీంతో మార్కెట్ లో ఇవి షార్టేజ్ అయ్యాయి.  అపోలో లైఫ్ చైర్ పర్సన్ ఉపాసన మాస్క్ ల వాడాకం పై ప్రజలకు అవేర్ నెస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గాను మాస్క్ ల అవసరాన్ని.. వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడాన్ని  ఓ వీడియోను రూపొందించారు ఉపాసన.

కోరనా ఉన్నవారికి దగ్గరగా ఉన్నప్పుడు, కరోనా వైరస్ తో బాధ పడుతున్నప్పుడు మాత్రమే మాస్క్ లు వాడాలని సూచించారు ఉపాసన. మార్కెట్ లో దొరికే మాస్క్ ల కోసం ఎదురుచూడకుండా ఇంట్లో ఉండే టిష్యూ పేపర్ లతో మాస్క్ లు తయారు చేసుకోవచ్చని వీడియోలో సూచించారు. ముఖ్యంగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతోనే ఒకరికొరకు గౌరవించుకొవాలని తెలిపారు. నమస్కారంతో చాలా అంటురోగాలు రాకుండా ఉంటాయని అన్నారు.