ఉపాసన కొణిదెల కు మహాత్మా గాంధీ అవార్డు

ఉపాసన కొణిదెల కు మహాత్మా గాంధీ అవార్డు

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నాయకత్వ విభాగంలో మహాత్మా గాంధీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడంపై ఆమె తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మహాత్మా గాంధీ అవార్డు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గాంధీ జయంతి మా కుటుంబానికి చాలా ప్రోత్సాహకరంగా నిలిచిందంటూ ఉపాసన ట్విటర్ల్ ట్వీట్ చేశారు.

ఉపాసన బీ పాజిటివ్ పత్రికకు సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు. యువ వ్యాపారవేత్తగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు. తన భర్త రాంచరణ్ కు సినిమాల విషయంలో తోడుగా వుంటూనే… సోషల్ కార్యక్రమాల్లో చురుకుగ్గా పాల్గొంటూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు  ఉపాసన.