
గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ ఆస్తుల విలువ ఎంతో ప్రకటించింది.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం. నయీమ్ ఆర్థిక సామ్రాజ్యం విలువ మొత్తం రూ.2వేల కోట్లుగా తేల్చింది.
భువనగిరికి చెందిన నయీముద్దీన్ … 2016 ఆగస్ట్ 8న షాద్ నగర్ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. నయీముద్దీన్ అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. సిట్ తాజాగా ఆ వివరాలను ప్రకటించింది.
నయీమ్ ప్రాపర్టీ వివరాలు
-
1 వెయ్యి 19 ఎకరాల వ్యవసాయ భూములు
-
29 భవనాలు
-
2 కిలోల బంగారం
-
రూ.2కోట్ల నగదు
ఈ ఆస్తులన్నీ నయీమ్ కేసును విచారణ చేస్తున్న కోర్టు పరిధిలోకి వచ్చాయి.
నయీమ్ పై నమోదైన మొత్తం కేసులు 251. వీటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయినట్టు సిట్ ప్రకటించింది. ఇంకా 60 కేసులు కొలిక్కి రావడం లేదని.. మిగతా కేసుల్లో దర్యాప్తు చివరిదశలో ఉందని తెలిపింది.
మరో రెండు నెలల్లో నయీమ్ కేసును క్లోజ్ చేస్తామని సిట్ తెలిపింది.